80వేలు దాటిన కరోనా కేసులు- దక్షిణ కొరియాలో విజృంభణ - coronavirus touches 893 in South Korea
కరోనా వైరస్ దక్షిణ కొరియాపై పంజా విసురుతోంది. ఇప్పుటివరకు ఈ దేశంలో 893 కేసులు నమోదయ్యాయి. తాజాగా ఇద్దరి మృతి చెందగా.. మొత్తం మరణాలు తొమ్మిదికి చేరుకున్నాయి.
80వేలు దాటిన కరోనా కేసులు.. దక్షిణ కొరియాలో విజృంభణ
By
Published : Feb 25, 2020, 5:46 PM IST
|
Updated : Mar 2, 2020, 1:18 PM IST
దక్షిణ కొరియాలో కరోనా వైరస్ బారిన పడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఆ దేశంలో కొత్తగా 60 కేసులు నమోదయ్యాయి. కేవలం మూడు రోజుల్లో వైరస్ సోకిన వారి సంఖ్య 893కు చేరుకుంది. డేగు, ఉత్తర జియోంగ్సాంగ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం అధికంగా ఉంది.
2.5 మిలియన్ల జనాభా ఉన్న డేగు రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ప్రజలు మాస్క్‌ల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు.
ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, శ్వాసకోశ సంబంధిత రోగులు ఇళ్లకే పరిమితమవ్వాలని చెబుతున్నారు.
" ప్రస్తుతం దక్షిణ కొరియా పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంది. కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు గట్టి పోరాటం చేయాల్సిన సమయం ఇది. ఇందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది."
-మూన్ జే ఇన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు
80వేలు దాటిన కేసులు..
కరోనా బాధితుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 80 వేలకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలను వెల్లడించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.