ఇరాక్‌లో మొహర్రం ప్రార్థనల్లో అపశ్రుతి చోటుచేసుకుంది.రాజధాని బాగ్దాద్ సమీపంలోని కర్బాలా మసీదు వీధుల్లో చేస్తున్న పవిత్ర అషురా ఊరేగింపులో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 31 మంది మరణించారు. 100 మందికిపైగా గాయపడ్డారు. 10 మంది పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది.
ఇరాక్ మసీదులో తొక్కిసలాట.. 31 మంది మృతి! - మొహర్రం
ఇరాక్‌లోని కర్బాలా మసీదులో జరిగిన తొక్కిసలాటలో 31 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు.
ఇరాక్ మసీదులో తొక్కిసలాట
పవిత్ర దినం అషురా సందర్భంగా ప్రార్థనల కోసం వేల మంది హాజరయ్యారు. అది కాస్తా తొక్కిసలాటకు దారితీసుండొచ్చని, కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: హై అలర్ట్: భారత్‌పై దాడులకు పాక్ కుట్ర..!
Last Updated : Sep 30, 2019, 4:15 AM IST