అవినీతి, లంచం, నమ్మక ద్రోహం ఆరోపణలపై మూడు వేరువేరు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త లాక్‌డౌన్ ఆంక్షలను లెక్క చేయకుండా వారాంతపు నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారు.
ప్రధాని నెతన్యాహు వైదొలగాలంటూ దేశవ్యాప్త ఆందోళనలు రోడ్లపైనే ప్రార్థనలు
నెతన్యాహుపై జూన్ నుంచి విచారణ కొనసాగుతుండగా.. ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అప్పటి నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అందుకు అంగీకరించని నెతన్యాహు.. పదవిలోనే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రజలు భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి మరీ ప్రధాన మంత్రి అధికారిక నివాసం ఎదుట వేలాదిగా చేరి ఆందోళన చేపట్టారు. నెతన్యాహుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొన్నిచోట్ల చెత్తను కుప్పగా పోసి నిప్పంటించారు. రోడ్లపైనే సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
ఇదీ చదవండి:15 రాకెట్లతో ఇజ్రాయెల్‌పై దాడి