ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. నెతన్యాహు అధికారిక నివాసం వెలుపల పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు ప్రజలు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రధాని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరోనావైరస్ నియంత్రణలో విఫలమయ్యారని ధ్వజమెత్తారు.
కరోనా నియంత్రణలో మెరుగ్గానే వ్యవహరిస్తోందని ప్రశంసలు అందుకున్న ఇజ్రాయెల్.. క్రమంగా వైరస్ విషయంలో పట్టు కోల్పోయింది. మే నెలలో వెంటనే లాక్డౌన్ను ఎత్తివేయడం వల్ల కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోయింది. ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే కరోనా ప్రబలుతోందని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిరుద్యోగం సైతం రెండంకెల స్థాయికి చేరిందని విరుచుకుపడుతున్నారు.
దానికి తోడు కరోనా