తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ సముద్రంలో సరదాగా తేలడం ఇక కష్టమే!

భూమిపై అతి తక్కువ విస్తీర్ణంలో ఉండే మృత సముద్రం వేగంగా కుచించుకుపోతోంది. పర్యావరణ ప్రభావం, వేగంగా తరిగిపోతున్న అటవీ సంపద, నీటి మళ్లింపు వంటి చర్యలతో ఉనికి కోల్పోతోంది. సముద్రం పక్కన ఆహ్లాదకర దృశ్యాలు కనుమరుగై నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.

By

Published : Aug 12, 2019, 11:09 AM IST

Updated : Sep 26, 2019, 5:44 PM IST

మానవ తప్పిదాలతో మృత సముద్రం ఉనికి ప్రశ్నార్థకం

మానవ తప్పిదాలతో మృత సముద్రం ఉనికి ప్రశ్నార్థకం

ఇజ్రాయెల్​ - జోర్డాన్ మధ్య విస్తరించి పెద్ద కొలనులా కనిపిస్తుంది మృత సముద్రం. ప్రస్తుతం ఇది ఉనికి కోల్పోతోంది. 1980లో సముద్ర మట్టం 400 మీటర్ల కన్నా తక్కువగా ఉండేది. నేడు 430 మీటర్ల దిగువకు పడిపోయింది. సముద్ర తీరం దాదాపు 2 కిలోమీటర్లు లోపలికి వెళ్లిపోయింది.

ఖనిజాల వెలికితీత కోసం మృత సముద్రంలో విచ్చలవిడిగా జరిపిన తవ్వకాలే ఇందుకు కారణమని భూగర్భ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఏటా వివిధ నదుల నుంచి 130 కోట్ల క్యూబిక్​ మీటర్ల నీరు మృత సముద్రంలో కలుస్తుంది. ఆ నదులన్నీ ప్రస్తుతం వేగంగా ఎండిపోతున్నాయి. ఈ సముద్రంలోకి ప్రధానంగా నీటిని పంపే నదులు హెర్మోన్​ పర్వతంలో ఉద్భవిస్తాయి. ఈ నీటిని 70 శాతం వరకు సముద్రంలోకి చేరకుండా జోర్డాన్​ నదిపై ఆనకట్టలు నిర్మించారు. ఫలితంగా మృత సముద్ర ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

"1947, 1945లో ఇక్కడ నిలబడి మృత సముద్రంలోని నీటి మట్టం చూశాను. అప్పుడు నీటిమట్టం సముద్ర మట్టానికి 400 మీటర్ల దిగువన ఉంది. నేడు నీటి మట్టం సముద్ర మట్టానికి 434, 435 మీటర్ల దిగువన ఉంది. మృత సముద్రం నీటి మట్టం 30 మీటర్ల కంటే ఎక్కువ పడిపోయింది. నీటి మట్టం పతనానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణం. ఈ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల చర్యల వల్ల ఇది జరుగుతోంది. జోర్డాన్ నదిపై ఆనకట్ట నిర్మించడం వల్ల కూడా మృత సముద్ర మట్టం తగ్గుతోంది."

-మార్‌డెచాయ్‌ స్టెయిన్‌, భూవిజ్ఞాన శాస్త్రవేత్త

వాతావరణ మార్పులే కారణమా?

మృత సముద్రంలో సంభవిస్తున్న పరిణామాలకు కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో తీవ్ర కరవు వచ్చే పరిస్థితి ఉందని భూగర్భ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మానవ కార్యకలాపాల వల్ల కలిగే పర్యావరణ విపత్తు భవిష్యత్తులో నిజం కాబోతోందని హెచ్చరిస్తున్నారు.

పర్యటకుల ఆసక్తి తగ్గింది

మనుషులు ఈత కొట్టకపోయినా నీటిపై తేలుతూ ఉండే మృత సముద్రానికి పర్యటకుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఇందులో నీరు తగ్గటం వల్ల యాత్రికులు ఎక్కువగా ఆసక్తి చూపటం లేదు. సముద్ర తీరంలో ఏర్పాటు చేసిన భవనాలు, రెస్టారెంట్లు, విభిన్న ఆకృతులు పూర్తిగా ధ్వంసం అయిపోయాయి.
ఒకప్పుడు ఆహ్లాదంగా కనిపించిన ప్రాంతం ఇప్పుడు కళా విహీనంగా మారింది. తీర ప్రాంతంలో గతంలో తీసిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. ఫలితంగా పర్యటకులు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు. సముద్రాన్ని వీక్షించే వారి సంఖ్య గణనీయంగా తగ్గడం వల్ల అధికారులు బీచ్​లను మూసేశారు.

ఇదీ చూడండి:స్పెయిన్​లో కార్చిచ్చు... వేలాది ఎకరాలు దగ్ధం

Last Updated : Sep 26, 2019, 5:44 PM IST

ABOUT THE AUTHOR

...view details