తెలంగాణ

telangana

ETV Bharat / international

యూఏఈ- ఇజ్రాయెల్​ మధ్య టెలిఫోన్​ సర్వీసు షురూ - ఇజ్రాయెల్​ యూఏఈ

చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజుల అనంతరం యూఏఈ- ఇజ్రాయెల్​ మధ్య టెలిఫోన్​ సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ఫోన్​ ద్వారా సంభాషణ జరిపారు.

Telephone service begins between UAE and Israel amid deal
యూఏఈ-ఇజ్రాయెల్​ మధ్య టెలిఫోన్​ సర్వీసు ప్రారంభం

By

Published : Aug 16, 2020, 7:37 PM IST

యూఏఈ- ఇజ్రాయెల్ మధ్య టెలిఫోన్​ సర్వీసులు ఆదివారం మొదలయ్యాయి. తమ మధ్య ఉన్న విభేదాలకు చెక్​ పెడుతూ ఇరు దేశాలు చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో ఈ వార్తకు ప్రాధాన్యం సంతరించుకుంది.

జెరుసలేం, దుబాయ్​లోని జర్నలిస్టులు.. మధ్యాహ్నం 1:15 గంటలకు ఒకరికొకరు ఫోన్​ చేసుకోగలిగారు. ఇది జరిగిన గంటకు తమ విదేశాంగ మంత్రి షేక్​ అబ్దుల్లా బిన్​ జాయెద్​ అల్​ నహ్యన్​.. ఇజ్రాయెల్​ విదేశాంగమంత్రి గబి అష్కెనజితో ఫోన్​లో మాట్లాడినట్టు యూఏఈ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో యూఏఈకి అభినందనలు తెలుపుతూ ఇజ్రాయెల్​ సమాచారశాఖ మంత్రి హందెల్​ ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని సమస్యలు తొలిగిపోయి.. ఆర్థికంగా కొత్త అవకాశాలు వస్తాయని, ఇరు దేశాల మధ్య నమ్మకం పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏడు దశాబ్దాల విభేదాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు ఏర్పరచుకున్న తొలి గల్ఫ్‌ దేశంగా యూఏఈ చరిత్ర సృష్టించింది.అమెరికా ప్రొద్బలంతో పాలస్తీనా వెస్ట్‌ బ్యాంక్‌లోని వివాదాస్పద ప్రాంతాల ఆక్రమణను నిలిపివేసేందుకు ఇజ్రాయెల్‌ అంగీకరించినందున యూఏఈ ఈ మేరకు శాంతి ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి:-వైద్య పరికరాలతో భారత్​కు ఇజ్రాయెల్​' కృతజ్ఞత'

ABOUT THE AUTHOR

...view details