అఫ్గాన్‌లో మహిళలపై ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నిండు గర్భంతో ఉన్న ఓ పోలీస్‌ను తాలిబన్లు కాల్చిచంపారని బీబీసీ వార్తా సంస్థ తెలిపింది. సెంట్రల్ ఘోర్ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. కుటుంబ సభ్యుల ముందే ఆ మహిళను కాల్చేశారని పేర్కొంది.
ఎనిమిది నెలల గర్భంతో ఉన్న నేగర్ అనే మహిళా పోలీసు.. స్థానికంగా ఓ జైళ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారినిని చంపడానికి వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. వారు అరబిక్ మాట్లాడుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.