అఫ్గానిస్థాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకుని తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. తాజాగా అఫ్గాన్ అధ్యక్ష భవనంపై (taliban news) తమ జెండా ఎగురవేశారు. అమెరికా రాయబార కార్యాలయం గోడలపైన కూడా తాలిబన్లు (afghanistan taliban) తమ జెండాను పెయింట్ చేశారు. యూఎస్‌లో వైమానిక దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తయిన రోజే తాలిబన్లు అఫ్గాన్ అధ్యక్షుడి భవనంపై జెండా ఎగురవేయడం గమనార్హం.
Taliban News: అఫ్గాన్ అధ్యక్షుడి భవనంపై తాలిబన్ల జెండా
అఫ్గాన్ అధ్యక్షుడి భవనంపై తాలిబన్లు (taliban news) శనివారం తమ జెండాను ఎగురవేశారు. అమెరికాపై వైమానిక దాడులు జరిగి 20 ఏళ్లు పూర్తయిన రోజే తాలిబన్లు.. జెండా ఎగురవేయడం గమనార్హం.
అఫ్గాన్ అధ్యక్షుడి భవనంపై తాలిబన్ల జెండా
ఈ నెల 7న తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. సెప్టెంబర్ 11న న్యూయార్క్ ట్విన్ టవర్లపై దాడికి (9/11 Attack) 20ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంత్రివర్గ ప్రమాణస్వీకారోత్సవం ఉంటుందని ప్రకటించారు. అయితే మిత్రపక్ష దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావటం వల్ల ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు.
ఇదీ చూడండి :9/11 attacks: 20ఏళ్ల పాటు అమెరికా పోరాటం.. ఫలితమేంటి?