తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇజ్రాయెల్​పై గాజా రాకెట్​ దాడులు - Israeli military

గాజాలోని పాలస్తీనా మిలిటెంట్లు.. ఇజ్రాయెల్​పై రాకెట్​ దాడులకు పాల్పడినట్లు ఆ దేశం ప్రకటించింది. అయితే.. ఇజ్రాయెల్​ వైమానిక దళాలు వాటిని ధ్వంసం చేశాయని స్పష్టం చేసింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. మరోవైపు.. ఇజ్రాయెల్​ క్షిపణి దాడులపై సిరియా వైమానిక దళం దీటుగా స్పందించిందని ఆ దేశ మీడియా వెల్లడించింది.

Syria
ఇజ్రాయెల్​పై గాజా రాకెట్​ దాడులు

By

Published : Dec 26, 2020, 5:56 AM IST

Updated : Dec 26, 2020, 7:58 AM IST

ఇజ్రాయెల్​పై గాజాలోని పాలస్తీనా మిలిటెంట్లు రాకెట్​ దాడులు చేశారని ఆ దేశ సైన్యం వెల్లడించింది. దక్షిణ ఇజ్రాయెల్​లోని​ తీరప్రాంతం ఆష్కెలాన్​ లక్ష్యంగా రెండు రాకెట్లను ప్రయోగించారని పేర్కొంది. అయితే.. తమ దేశ వైమానిక దళ సిబ్బంది రాకెట్లను ధ్వంసం చేశారని స్పష్టం చేసింది. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని తెలిపింది.

ఇజ్రాయెల్​పై గాజా రాకెట్​ దాడులు

ఇజ్రాయెల్​ దాడి.. సిరియా ప్రతిదాడి..

మరోవైపు.. ఇజ్రాయెల్​, సిరియా మధ్య క్షిపణి దాడులు జరిగాయి. ఇజ్రాయెల్‌కు చెందిన కొన్ని జెట్‌ విమానాలు శుక్రవారం ఉదయం లెబనాన్‌ భూభాగంలో అత్యంత తక్కువ ఎత్తులో ప్రయాణించినట్టు సమాచారం. రాజధాని బీరుట్‌ గగనతలంలో క్షిపణులు‌ ఎగరటం తాము చూశామని కొందరు పౌరులు తెలిపారు. ఇదే సమయంలో సిరియాకు చెందిన మాసైయాఫ్‌ నగరంలో పేలుళ్లు సంభవించినట్టు అక్కడి అధికారిక మీడియా ప్రకటించింది. ఇజ్రాయెల్‌ ఇక్కడి హమా ప్రాంతంలో దాడి చేసిందని.. ఇందుకు సిరియా వైమానిక దళం దీటుగా స్పందించిందని ఆ దేశ మీడియా ప్రకటించింది. కాగా, ఏ లక్ష్యం కోసం ఈ దాడి జరిగిందీ, మృతుల సంఖ్య తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. క్రిస్మస్‌ పర్వదినాన దాడులు జరగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ఇదీ చూడండి: చైనా టీకాలపైనే పేద దేశాల ఆశలు- పనిచేస్తాయా?

Last Updated : Dec 26, 2020, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details