Syria militants attack: సిరియాలో భద్రతా బలగాలు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది సిబ్బంది మృతి చెందారు. పాల్మీరా ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు అధికారులు కూడా ఉన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ సనా పేర్కొంది. అత్యాధునికమైన ఆయుధాలతో దాడి చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ దాడికి ఎవరు కారణమన్నది తెలియలేదు.
సిరియా అధికారులు.. 2019 నుంచి దేశంలో ప్రాదేశిక నియంత్రణను కోల్పోయినప్పటికీ.. దక్షిణ,మధ్య సిరియాల్లో క్రియాశీలకంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రమూకలు గతంలో ఇటువంటి దాడులకు పాల్పడ్డారు. జనవరిలో పాల్మీరా ప్రాంతంలోనే భద్రతా దళాల వాహనంపై ఐఎస్ ఉగ్రవాదులు రాకెట్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో కాల్పులు జరిపగా.. ఐదుగురు సైనికులను ప్రాణాలు కోల్పోయారు.