దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా సంక్షోభం పట్ల గల్ఫ్ దేశం యూఏఈ సంఘీభావం ప్రకటించింది. ఈ మేరకు దుబాయ్‌లో నిర్మితమైన ప్రపంచంలోనే ఎత్తైన భవనం 'బుర్జ్ ఖలీఫా'పై 17 సెకన్ల పాటు త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ట్విట్టర్లో షేర్ చేసింది. భారత జాతీయ జెండాతో పాటు 'స్టే స్ట్రాంగ్ ఇండియా' అనే సందేశాన్ని సైతం బుర్జ్ ఖలీఫా ప్రదర్శించింది.
కరోనాపై చేస్తున్న పోరులో విజయం సాధించాలని భారత్‌కు స్నేహ దేశమైన యూఏఈ కోరుకుంటోందని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.
దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా ఆకాశహర్మ్యం 829.8 మీటర్ల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తైన నిర్మాణంగా పేరొందింది.