తెలంగాణ

telangana

ETV Bharat / international

వీసాల కోసం తొక్కిసలాట -11మంది మృతి - stampede in afghanistan

వీసాల కోసం ప్రజలు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల తొక్కిసలాట జరిగి 11మంది మృతి చెందిన సంఘటన అఫ్గానిస్థాన్​లో జరిగింది. మరో 13 మంది గాయపడ్డట్లు అధికార వర్గాలు తెలిపాయి. మరో ఘటనలో తాలిబన్లు జరిపిన ఆకస్మిక దాడిలో 34మంది అఫ్గాన్​ పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు.

visa news
వీసాల కోసం తొక్కిసలాట -11మంది మృతి

By

Published : Oct 21, 2020, 2:45 PM IST

Updated : Oct 21, 2020, 3:35 PM IST

అఫ్గానిస్థాన్​ తూర్పు నంగార్హర్​ ప్రాంతంలోని ఓ స్టేడియంలో వీసాల కోసం పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో తొక్కిసలాట జరిగి 11మంది మృతి చెందారు. సాకర్​ స్టేడియంలో జరిగిన ఈ ఘటన వివరాలనుప్రభుత్వ అధికారి అతుల్లా ఖోగ్యాని వెల్లడించారు. మరణించిన వారిలో ఎక్కువ మంది వృద్ధులని ధృవీకరించారు. గాయపడ్డ వారిలో మహిళలే అధికంగా ఉన్నారని తెలిపారు. వీరంతా పాకిస్థాన్​కు వెళ్లేందుకు వీసాల కోసం వచ్చినట్లు వివరించారు.

నంగార్హర్​లో ఉన్న పాకిస్థాన్​ కాన్సులేట్​ కరోనా దృష్ట్యా మూసివేశారు. ఇటీవల తెరుచుకోవటంతో భారీ సంఖ్యలో జనం తరలివచ్చారని తెలిపారు. గత వారం 19వేల వీసాలు జారీ చేసినట్లు వివరించారు. అఫ్గాన్​లో వరుస దాడులు, యుద్ధాలు, ఆర్థిక సంక్షోభం కారణంగా అనేక మంది పాకిస్థాన్​కు పయనమవుతున్నారని వెల్లడించారు.

మరో ఘటన..

ఉత్తర అఫ్గాన్​లో తాలిబన్లు జరిపిన ఆకస్మిక దాడిలో 34మంది అఫ్గాన్​ పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో 8మందికి గాయాలైనట్లు థాకర్​ ప్రావిన్స్​ వైద్యాధికారి రహీమ్​ బకిష్​ డానిష్​ వెల్లడించారు. చనిపోయిన వారిలో ఓ పోలీస్​ ఉన్నతాధికారి ఉన్నట్లు ప్రభుత్వ అధికారి జావద్ హిజ్రీ తెలిపారు.

ఓవైపు తాలిబన్లతో అఫ్గాన్​ ప్రభుత్వం నెల రోజుల నుంచి శాంతి చర్చలు జరుపుతున్నా తాలిబన్లు దాడికి యత్నించారని అధికారులు తెలిపారు.

తాలిబన్లు ఒక కాన్వాయ్​లో వచ్చి దాడికి పాల్పడినట్లు అఫ్గాన్ భద్రతాధికారి తెలిపారు. అనేక పోలీస్​ స్థావరాలకు నిప్పుపెట్టారని వివరించారు. అయితే దాడికి సంబంధించి తాలిబన్లు ఇంకా ప్రకటించలేదని పేర్కొన్నారు.

Last Updated : Oct 21, 2020, 3:35 PM IST

ABOUT THE AUTHOR

...view details