తెలంగాణ

telangana

ETV Bharat / international

తాలిబన్ల దాడిలో ఆరుగురు పోలీసులు మృతి - అఫ్గానిస్థాన్​లో పోలీసులపై తాలిబన్ల దాడి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరోసారి దాడికి పాల్పడ్డారు. పోలీసులపై జరిపిన ఆకస్మిక దాడిలో ఆరుగురు పోలీసులు మృతిచెందారు.

taliban attack, తాలిబన్ల దాడి
అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల దాడి.. 6 పోలీసులు మృతి

By

Published : Jan 2, 2021, 7:22 PM IST

Updated : Jan 2, 2021, 7:49 PM IST

అఫ్గానిస్థాన్​ నంగర్​హార్​ రాష్ట్రంలోని బాటీకోట్​ జిల్లాలో తాలిబన్లు.. పోలీసులపై శుక్రవారం ఆకస్మిక దాడి జరిపారు. ముష్కరులు చేసిన ఈ దాడిలో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ మేరకు వివరాలను స్థానిక మీడియా వెల్లడించింది.

మేమే చేశాం..

ఈ ఘటనకు తాము బాధ్యత వహిస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఆరుగురు చనిపోయారని వెల్లడించారు. అయితే గాయపడిన వారి సంఖ్య తొమ్మిదిగా ముష్కరులు తెలపడం గమనార్హం. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా.. తాలిబన్లు తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి :'ప్రమాణ స్వీకారం'లో కరోనా మృతులకు నివాళి

Last Updated : Jan 2, 2021, 7:49 PM IST

ABOUT THE AUTHOR

...view details