సౌదీ అరేబియాలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసును ఆ దేశ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తీసుకున్నారు. సౌదీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూపొందించిన జాతీయ ప్రణాళికలో భాగంగా.. యువరాజు టీకా తీసుకున్నారు.
దేశ ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల విశ్వాసం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఆయన తొలుత వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లు సౌదీ వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు దేశంలో 361,903 కరోనా కేసులు నమోదయ్యాయి. 6 వేల 168 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఫైజర్, బయోఎన్‌టెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ టీకా.. ఈ నెల ప్రారంభంలో సౌదీకి చేరింది.