ఏటా జరిగే హజ్ యాత్రను ఈసారి అత్యంత సాదాసీదాగా జరపాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించింది. 1000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది. జులై 29న ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. సౌదీ అరేబియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ తెలిపింది.
విదేశీయులకు నో..
సౌదీలో నివసిస్తున్న వారిని మాత్రమే ఈసారి హజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. వీరిలో 30 శాతం మంది సౌదీ దేశస్థులు కాగా.. మరో 70 శాతం మంది సౌదీలో నివసిస్తున్న విదేశీయులు ఉండనున్నట్లు సౌదీ హజ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రికుల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఆధునిక సౌదీ చరిత్రలో విదేశీయుల్ని అనుమతించకపోవడం ఇదే తొలిసారి.
కట్టుదిట్టమైన చర్యలు..