తెలంగాణ

telangana

ETV Bharat / international

'హజ్​ యాత్రకు 60 వేల మందికే అనుమతి'

మహమ్మారి కారణంగా ఈ ఏడాది హజ్​ యాత్రను స్థానికులకే పరిమితం చేయనున్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 60వేల మందినే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది.

By

Published : Jun 12, 2021, 6:32 PM IST

hajj saudi arabia, హజ్​ యాత్ర సౌదీ అరేబియా
హజ్​ యాత్రకు ఈ సారి విదేశీయులకు అనుమతి లేదు

కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది హజ్‌ యాత్రను కేవలం 60 వేల మందికే పరిమితం చేయనున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. వారంతా సౌదీ అరేబియాకు చెందిన వారేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ వెల్లడించింది. గత ఏడాది హజ్‌ యాత్రకు సౌదీ అరేబియాలో నివసిస్తున్న వెయ్యి మందికి అవకాశం కల్పించారు.

సాధారణంగా హజ్‌ యాత్రలో పాల్గొనేందుకు ప్రతి ఏటా 160 దేశాల నుంచి ముస్లింలు సౌదీ అరేబియా విచ్ఛేస్తారు. హజ్‌ యాత్రలో పాల్గొనే వారిలో మూడింట రెండొంతుల మంది విదేశీయులే ఉంటారు. ఒక వంతు మాత్రమే సౌదీ అరేబియాకు చెందిన వారు ఉంటారు. కరోనా నేపథ్యంలో విదేశీయులకు ఈసారి అవకాశం లేకుండా పోయింది. జులైలో హజ్‌ యాత్ర ప్రారంభంకానుంది.

ఇదీ చదవండి :అక్కడ ఊబకాయులను అద్దెకిస్తారట!

ABOUT THE AUTHOR

...view details