తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రాచీనానికి.. ఆధునికతకు అనుబంధం 'గుస్లి'

కళలపై తనకున్న ఆసక్తిని వినూత్నంగా చాటిచెబుతున్నాడు రష్యాకు చెందిన సెర్గె గోర్చకోవ్​. కనుమరుగైన పురాతన కాలం నాటి సంగీత సాధనను ఈ తరం యువతకు పరిచయం చేస్తూ తన కడుపు నింపుకుంటున్నాడు. ఆ సంగీత పరికరమే 'గుస్లి'

ప్రాచీనానికి..ఆధునికతకు అనుబంధం 'గుస్లి'

By

Published : Mar 31, 2019, 6:32 AM IST

ప్రాచీనానికి.. ఆధునికతకు అనుబంధం 'గుస్లి'
చూడటానికి చిన్న సైజు గిటార్​లా ఉన్న దీని పేరు గుస్లి. రష్యాలో దీనికి ఇప్పుడు విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలా అని గుస్లీని ఇటీవలే కనిపెట్టారనుకుంటే మీరు పొరబడ్డట్లే.

గుస్లిని 600వ శతాబ్దంలో సంగీతకారులు, నృత్యకారులు వినియోగించే వారు. దీని నుంచి వచ్చే శ్రావ్యమైన శబ్దాలు ఎంతో వినసొంపుగా ఉంటాయి. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఈ సంగీత సాధనం ఆధునిక ప్రపంచంలో కనుమరుగైంది. అలాంటి గుస్లిని తిరిగి రష్యావాసులకు అందిస్తున్నాడు సెర్గె గోర్చకోవ్​.

తన జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకున్న సెర్గె... పదేళ్ల క్రితం తన పూర్వీకుల ఇంటికి వెళ్లాడు. అక్కడే అతడికి కళల మీద ఉన్న ఆసక్తి బయటపడింది. కనుమరుగైన సంగీత పరికరాలకు కొత్త మెరుగులు దిద్ది ఈ తరం వారికి పరిచయం చేయాలని నిశ్చయించుకున్నాడు.

ఈ ప్రయాణంలోనే గుస్లి గురించి తొలిసారి విన్నాడు సెర్గె. కనుమరుగైన ఈ పరికరంపై వెంటనే పరిశోధన మొదలుపెట్టాడు. గుస్లికి ఉన్న చరిత్ర సెర్గెను ఆకట్టుకుంది.

ఈ ప్రయాణంలో గుస్లికి సంబంధించిన చిత్రాలు కనుగొన్నాడు. వాటి సాయంతో 2013లో తనకున్న చిన్న దుకాణంలో గుస్లి తయారీని ప్రారంభించాడు. ఇప్పుడా దుకాణం మూడంతస్తుల పరిశ్రమగా మారింది.

"ప్రాచీన కాలంతో అనుబంధం పెంచుకునేందుకు గుస్లి ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. తయారీ మొదలుపెట్టాం. ఇప్పడు నెలకు 150-200 గుస్లిలు తయారు చేస్తున్నాం. ఒక గుస్లి తయారు చేయడానికి మూడు రోజులు పడుతుంది. ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి. ఒక్కో పరికరం ధర 50-1000 డాలర్ల మధ్యలో ఉంది."
-- సెర్గె గోర్చకోవ్

సంగీత పరికరం కొంటే సరిపోతుందా? నేర్పించేవారెవరని అనుకుంటున్నారా? దానికీ సెర్గె వద్ద సమాధానముంది. కొందరితో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించాడు. దీనికి యువత నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. గుస్లిని నేర్చుకోవాలని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రపంచ దేశాలకు గుస్లి చరిత్ర గురించి తెలిజేయడం తన ఆకాంక్ష అని చెబుతున్నాడు సెర్గె గోర్చకోవ్​.

ABOUT THE AUTHOR

...view details