తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​లోని అమెరికా స్థావరం వద్ద రాకెట్ దాడులు

ఇరాక్​లో అమెరికా బలగాల స్థావరానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ఏప్రిల్​ 7న అమెరికా-ఇరాక్​ చర్చలు జరపడానికి ముందు ఈ దాడి జరగడం గమనార్హం.

By

Published : Apr 4, 2021, 8:53 PM IST

Rockets hit near Iraq base housing US trainers
ఇరాక్​ స్థావరంపై రాకెట్​ దాడి

ఇరాక్‌ దక్షిణ బగ్దాద్​లోని అమెరికా బలగాల స్థావరానికి సమీపంలో రాకెట్ దాడులు జరిగాయి. బాలాద్​ ఎయిర్​ బేస్​కు సమీపంలో రెండు రాకెట్లతో దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. బలగాల ఉపసంహరణపై అమెరికా-ఇరాక్​ చర్చలు జరపడానికి ముందు ఈ రాకెట్ దాడులు జరగడం గమనార్హం.

ఏప్రిల్​ 7న ఇరాక్​ ప్రభుత్వం అమెరికాతో నాలుగోసారి చర్చలు జరపనుంది. ట్రంప్​ అధికారంలో ఉండగా గత ఏడాది జూన్​లో చర్చలు ప్రారంభమయ్యాయి. బైడెన్​ అధికారంలోకి వచ్చాక తొలిసారి ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇరాక్​లో ఉన్న అమెరికా బలగాల ఉపసంహరణ సహా ఉగ్రవాదం తదితర అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి.

2011లో ఇరాక్​ నుంచి బలగాలను అమెరికా ఉపసంహరించుకుంది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇరాక్ ప్రభుత్వం సహాయం కోరాగా.. 2014లో మళ్లీ బలగాలను మోహరించింది. ట్రంప్​ అధికారంలో ఉన్నప్పుడు ఇరాక్​లో అమెరికా బలగాల సంఖ్యను 2500లకు తగ్గించారు. మిగిలిన బలగాలను సైతం ఉపసంహరించే అంశంపై ఇరు దేశాలు చర్చలు జరపనున్నాయి.

ఇదీ చదవండి:హఫీజ్ అనుచరులకు 9 ఏళ్లు జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details