తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​లోని అమెరికా దళాలపై రాకెట్​ దాడులు

ఇరాక్​లో అమెరికా బలగాలున్న స్థావరంపై వరుస రాకెట్ దాడులు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డట్లు వెల్లడించారు.

By

Published : Apr 19, 2021, 10:57 AM IST

Rockets hit
రాకెట్​ దాడి

ఇరాక్‌ ఉత్తర బగ్దాద్​లో అమెరికా బలగాలు ఉన్న స్థావరంపై వరుస రాకెట్ దాడులు జరిగాయి. బాలాద్​ ఎయిర్​ బేస్​పై రెండు రాకెట్లతో దుండగులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు ఇరాక్ భద్రతా దళ సిబ్బంది గాయపడ్డట్లు తెలిపారు. దాడి సమయంలో బాలాద్ ఎయిర్​బేస్​లో ఇద్దరు అమెరికా ట్రైనర్లు ఉన్నారని చెప్పారు.

ఇరాక్​లోని అమెరికా దళాల లక్ష్యంగా జరుగుతున్న దాడుల సంఖ్య ఇటీవల పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే.. ఉత్తర ఇరాక్​లోని ఓ ఎయిర్​పోర్ట్​లో అమెరికా నేతృత్వం వహిస్తున్న కూటమి బలగాలపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడితో భారీగా మంటలు చెలరేగగా.. ఓ భవనం ధ్వంసమైంది.

2011లో ఇరాక్​ నుంచి బలగాలను అమెరికా ఉపసంహరించుకుంది. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు ఇరాక్ ప్రభుత్వం సహాయం కోరాగా.. 2014లో మళ్లీ బలగాలను మోహరించింది. ట్రంప్​ అధికారంలో ఉన్నప్పుడు ఇరాక్​లో అమెరికా బలగాల సంఖ్యను 2500కు తగ్గించారు.

ఇదీ చదవండి:ఎస్​యూవీ కాలువలోకి దూసుకెళ్లి 13 మంది మృతి

ఇదీ చదవండి:పబ్​లో పేలిన తుపాకీ.. ముగ్గురు మృతి

ABOUT THE AUTHOR

...view details