సిరియాలో భారీ పేలుడు (Syria Bomb Blast) సంభవించింది. సైనికులు(Syria Bomb Blast) ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా పేలింది. రాజధాని డమాస్కస్‌లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడినట్లు (Syria Bomb Blast) స్థానిక మీడియా వెల్లడించింది.
సైనికుల బస్సుకు ముందే బయటినుంచి రెండు బాంబులు అమర్చారు దుండగులు. పేలుడు సంభవించిన సమయంలో ఆ ప్రాంతం రద్దీగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
ఈ దాడికి తక్షణమే ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే.. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్‌ను గద్దె దించాలని చూస్తున్న తిరుగుబాటుదారులు, జిహాదీ గ్రూప్‌లే దీని వెనుక ఉన్నట్లు భావిస్తున్నారు.
మరోచోట 10 మంది పౌరులు..
సిరియాలోనే జరిగిన మరో దుశ్చర్యలో 10 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ఓ ప్రాంతంపై సైనికులు కాల్పులు జరపగా సాధారణ పౌరులు చనిపోయారు. ఇందులో నలుగురు పిల్లలు, ఓ మహిళ ఉన్నారు.
డమాస్కస్ శివార్లలో తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న ప్రాంతాలను కొన్నాళ్ల కిందటే.. ప్రభుత్వ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మిత్ర దేశాలు రష్యా, ఇరాన్ సహకారంతో సిరియాపై అధ్యక్షుడు బషర్ అసద్ దాదాపు పూర్తిస్థాయిలో పట్టుసాధించారు. 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలుకాగా.. 3 లక్షల 50 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 50 లక్షల మంది శరణార్థులుగా తరలివెళ్లారు.
ఇదీ చూడండి :జపాన్ సముద్రంలోకి ఉత్తర కొరియా క్షిపణి!