Road Accident In Iran: మినీ బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 10 మంది మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. ఇరాన్లో ఈ ఘటన జరిగింది.
ట్రక్కు, బస్సు ఢీ- 10 మంది దుర్మరణం - ఇరాన్ ట్రక్కు, బస్సు ప్రమాదం
14:38 December 25
ట్రక్కు, బస్సు ఢీ- 10 మంది దుర్మరణం
ఖుజెస్థాన్ రాష్ట్రంలోని అహ్వాజ్- ఖోర్రామ్‌షహర్ నగరాల్ని కలిపే రహదారిపై కూలీలతో వెళ్తున్న మినీ బస్సును ట్రక్కు ఢీకొనగా ఈ ప్రమాదం జరిగిందని ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపింది.
ఈ ఘటనలో ట్రక్కు డ్రైవర్ సహా 9 మంది కూలీలు మరణించారని అధికారులు తెలిపారు. బస్సును మరో మూడు కార్లు ఒకదాని వెనుక మరొకటిగా ఢీకొన్నాయని చెప్పారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించామని పేర్కొన్నారు.
ఇరాన్ ట్రాఫిక్ నిబంధనలు ప్రపంచంలోనే అత్యంత అధ్వానంగా ఉంటాయి. అందుకే ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇటీవల సాధారణమైపోయింది. మార్చి నెలలో జరిగిన ఓ ప్రమాదంలో 8 మంది చిన్నారులు సహా 14 మంది మరణించారు.