తూర్పు టర్కీలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య 29కి చేరింది. అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారికోసం అన్వేషిస్తున్నారు. సుమారు 3,500 మంది రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. బాధితులకు పదివేల పడకలు, దుప్పట్లు, గుడారాలు అందించినట్లు అధికారులు తెలిపారు.
ఈశాన్య రాష్ట్రమైన ఇలాజిగ్లోని సివ్రైస్ పట్టణం కేంద్రంగా 6.8 తీవ్రతతో శుక్రవారం భూకంపం వచ్చింది. తాజాగా శనివారం 5.1 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 72 భవనాలు నేలమట్టం కాగా.. మరో 514 భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వెల్లడించారు.