తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​: ప్రభుత్వ కార్యాలయాలకు నిరసన సెగ - ఇరాక్​ ఆందోళనలు

ఇరాక్​లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు రోజురోజుకు ఉద్రిక్తమవుతున్నాయి. తాజాగా నిరసనకారులు గవర్నర్​ కార్యాలయాన్ని చుట్టుముట్టి, సమీపంలోని భవనానికి నిప్పంటించారు. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు వారిపై బాష్పాయువులను ప్రయోగించారు. ఈ ఘటనలో120 మంది గాయపడ్డారు.

ఇరాక్​లో రక్తసిక్తంగా మారిన నిరసనలు

By

Published : Nov 9, 2019, 9:42 PM IST

Updated : Nov 9, 2019, 10:08 PM IST

ఇరాక్​లో రక్తసిక్తంగా మారిన నిరసనలు

ఇరాక్​లో రాజకీయ మార్పును కోరుతూ ప్రజలు చేస్తున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. తాజాగా బస్రాలోని వందలాదిమంది నిరసనకారులు గవర్నరెట్​ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయ సమీపంలోని ఓ భవనానికి ఆందోళనకారులు నిప్పంటించారు. పరిస్థితులను అదుపుచేసేందుకు.. నిరసనకారులపై పోలీసులు బాష్పయువులు ప్రయోగించారు. ఈ ఘటనలో 120మంది గాయపడ్డారు.

250 మంది మృతి

కొంతమంది ముసుగులు ధరించి నిరసనకారులపై దాడి చేశారని, ఈ ఘటనలో ఐదుగురు మరణించారని స్థానిక మీడియా పేర్కొంది. అక్టోబరు 1న మొదలైన నిరసనల్లో ఇప్పటివరకు 250కిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:117 ఏళ్ల తర్వాత అరేబియా సముద్రంలో ఇదే తొలిసారి

Last Updated : Nov 9, 2019, 10:08 PM IST

ABOUT THE AUTHOR

...view details