ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొవిడ్ టీకాను తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తొలి ఇజ్రాయెలీగా ప్రధాని నిలిచారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమాన్ని స్థానిక మీడియా ప్రత్యక్షప్రసారం చేసింది.
"ఈ వ్యాక్సిన్‌పై నాకు నమ్మకం ఉంది. టీకా తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకే నేను ముందు తీసుకున్నాను. ఈ క్షణం నాకు సంతోషంగా ఉంది."
-బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని