తెలంగాణ

telangana

ETV Bharat / international

షియా మత పెద్దతో పోప్​ ఫ్రాన్సిస్ చారిత్రక సమావేశం - గ్రాండ్ అయతొల్లా అలీ అల్​-సిస్థానీ

ఇరాక్​లో ఇస్లాం మత పెద్ద అల్​-సిస్థానీను చారిత్రాక ఉర్​ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశం కోసం వాటికన్​ నుంచి వచ్చిన పోప్​కి సిస్థానీ స్వయంగా ఆతిథ్యం ఇవ్వడం విశేషం.

Pope, top Iraq Shiite cleric hold historic, symbolic meeting
ఇరాక్ అగ్రనేత-పోప్​ ఫ్రాన్సిస్ చరిత్రాత్మక సమావేశం

By

Published : Mar 7, 2021, 7:49 AM IST

ఇరాక్​లోని నజాఫ్​ నగరంలో.. ఇస్లాం షియా మత పెద్ద, గ్రాండ్ అయతొల్లా అలీ అల్​-సిస్థానీతో పోప్​ ప్రాన్సిస్ సమావేశమయ్యారు. 90 ఏళ్ల సిస్థానీ.. ఇరాక్​లోనే అత్యంత శక్తిమంతమైన షియా నేత. తన పర్యటనలో భాగంగా పోప్ రెండో రోజు​ శనివారం ​ఈ చర్చల్లో పాల్గొన్నారు.

క్రైస్తవులకూ సమాన హక్కులు..

ఇరువురి మధ్య చారిత్రక సమావేశం 40 నిమిషాలు సాగింది. ఇరాక్​లోని క్రైస్తవులకూ మిగతా ప్రజలతో సమానమైన హక్కులుంటాయని ఈ సందర్భంగా పోప్​తో సిస్థానీ చెప్పినట్లు తెలుస్తోంది. సాధారణంగా అతిథులకు తన కుర్చీలోంచే ఆహ్వానం పలికే అల్​-సిస్థానీ.. ద్వారం వరకు వచ్చి 84 ఏళ్ల పోప్​ను తన గదిలోకి తీసుకువెళ్లారు. తర్వాత పోప్​ ఫ్రాన్సిస్ పురాతన నగరం ఉర్​ను దర్శించారు. అక్కడ ప్రార్థనలు చేశారు.

ఇదీ చదవండి:ఇరాక్​లోని అమెరికా స్థావరాలపై దాడి

ABOUT THE AUTHOR

...view details