తెలంగాణ

telangana

ETV Bharat / international

మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు:మోదీ - ధన్యవాదాలు

రెండోసారి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించబోతున్న మోదీకి ప్రపంచదేశాల అధ్యక్షులు, ప్రధానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వారందరికీ ప్రధాని పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు:మోదీ

By

Published : May 24, 2019, 4:32 PM IST

'పేరుపేరున ధన్యవాదాలు'

సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రపంచ దేశాల అగ్రనేతల శుభాకాంక్షలకు స్పందించిన ప్రధాని పేరుపేరునా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజాస్వామ్యం గెలిచిందని ట్విట్టర్​లో పేర్కొన్నారు. అన్ని దేశాలతో ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, రష్యా అధ్యక్షుడు పుతిన్, జపాన్​ ప్రధాని షింజో అబే సహా ప్రపంచ దేశాల అగ్రనేతలు ఫోన్ల ద్వారా, ట్విట్టర్​ వేదికగా మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: 'భారత ఎన్నికలు ప్రపంచానికే స్ఫూర్తిదాయకం'

ABOUT THE AUTHOR

...view details