తెలంగాణ

telangana

ETV Bharat / international

బహ్రెయిన్:​ శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి మోదీ శ్రీకారం - మనామా

ప్రధాని నరేంద్ర మోదీ బహ్రెయిన్ రాజధాని మనామాలోని 200 ఏళ్ల నాటి శ్రీనాథ్​జీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి 4.2 మిలియన్​ డాలర్ల ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు.

బహ్రెయిన్:​ శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి మోదీ శ్రీకారం

By

Published : Aug 25, 2019, 12:36 PM IST

Updated : Sep 28, 2019, 5:09 AM IST

బహ్రెయిన్:​ శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి మోదీ శ్రీకారం

బహ్రెయిన్​ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ... రాజధాని మనామాలోని 200 ఏళ్లనాటి శ్రీనాథ్​జీ (శ్రీకృష్ణ) దేవాలయాన్ని సందర్శించారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. మోదీ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి... అర్చకుల ఆశీర్వచనాలు పొందారు. అక్కడ కలయదిరుగుతూ ఆలయ విశేషాలు అడిగి తెలుసుకున్నారు.

శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధి ప్రాజెక్ట్​కు శ్రీకారం

శ్రీకృష్ణ ఆలయ అభివృద్ధికి సంబంధించి 4.2 మిలియన్ డాలర్ల ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా 16,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 అంతస్తులుగా ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ఐకానిక్ కాంప్లెక్స్, గర్భగుడి, ప్రార్థనా మందిరాలను ఆధునికంగా తీర్చిదిద్దుతారు. అభివృద్ధి పనులు ఈ ఏడాది చివరలో ప్రారంభం కానున్నాయి.

ఇదీ చూడండి: జీ-7: మోదీ-ట్రంప్​ భేటీలో ప్రధాన అంశాలు ఇవేనా?

Last Updated : Sep 28, 2019, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details