పెగాసస్ స్పైవేర్ గూఢచర్యం వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతున్న క్రమంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్ఎస్ఓ గ్రూప్ నిఘా సాఫ్ట్వేర్ దుర్వినియోగంపై దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. లైసెన్సుల జారీ విషయంపై పూర్తిస్థాయిలో సమీక్షించనున్నట్లు సూత్రప్రాయంగా తెలిపింది.
రాజకీయ నాయకులు, హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టులు సహా కీలక వ్యక్తులే లక్ష్యంగా పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించారని పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఈ క్రమంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు ఆర్మీ రేడియోకు తెలిపారు శాసనసభ్యుడు, విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిటీ చీఫ్ రామ్ బెన్ బరాక్.
'ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ.. ఉగ్రవాదం, అక్రమాలను అరికట్టేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలకు విక్రయించింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు అంతర్జాతీయ మీడియా కన్సార్టియం తెలిపింది. పెగాసస్ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి కాగానే.. వివరాలను తీసుకుని, ఏదైనా సవరణలు అవసరమా? అనేదానిపై నిర్ణయానికి వస్తాం. ఈ విషయంలో సమీక్షించటం వెనక లైసెన్స్‌ల జారీనే ఇజ్రాయెల్ ప్రాధాన్యం. చాలా ఉగ్రవాద సంస్థలను గుర్తించేందుకు పెగాసస్ ఉపయోగపడింది. అయితే.. దుర్వినియోగం కావటం, బాధ్యతారహిత వ్యవస్థలకు విక్రయించటం అనే విషయాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది."
- రామ్ బెన్ బరాక్, శాసనసభ్యుడు, విదేశీ వ్యవహారాలు, రక్షణ కమిటీ చీఫ్
స్వాగతించిన ఎన్ఎస్ఓ చీఫ్..