ఈజిప్టు క్వాల్యూబియా ప్రాంతంలో ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 32 మంది మరణించారు. మరో 109 మందికి గాయాలైనట్లు అధికారులు తెలిపారు. గాయపడినవారిని 60 అంబులెన్సుల్లో స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు వైద్యశాఖ పేర్కొంది.
రైలు ఈజిప్టు రాజధాని కెయిరో నుంచి నైలు డెల్టా నగరానికి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. చాలా మంది ప్రయాణికులు బోగీల్లో చిక్కుకున్నట్లు అధికారులు వివరించారు. సహాయక చర్యలను చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.