తెలంగాణ

telangana

ETV Bharat / international

రెబల్స్​తో భీకర ఘర్షణ- 80 మందికిపైగా మృతి

యెమెన్​లో (Yemen news) తిరుగుబాటుదారులు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య మంగళవారం జరిగిన దాడుల్లో 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది యెమెన్ ప్రభుత్వ దళాలు ఉన్నట్లు ప్రభుత్వ మిలిటరీ విభాగం తెలిపింది.

yemen
యెమెన్

By

Published : Oct 6, 2021, 5:05 AM IST

యెమెన్​లో ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య భీకర ఘర్షణలు (Yemen news) జరుగుతున్నాయి. మరిబ్ రాష్ట్రం, హరిబ్ జిల్లాలోని లామా ప్రాంతంలో మంగళవారం జరిగిన దాడుల్లో దాడులు జరిగాయి. 80 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 8 మంది యెమెన్ ప్రభుత్వ దళాలు కాగా.. 74 మంది యెమెన్​ రెబల్స్ ఉన్నట్లు ప్రభుత్వ మిలిటరీ విభాగం తెలిపింది. అయితే ఈ ఘటనపై హౌతీ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.

దాడులు ఎందుకు?

2014లో ఇరాన్​ మద్దతుతో హౌతీలు (Yemen News) రాజధాని సనాను చేజిక్కించుకున్నప్పటి నుంచి యెమెన్​లో అంతర్యుద్ధం (Yemen Civil War) మొదలైంది. సనా సహా దేశంలోని ఉత్తర భాగాన్ని హౌతీలు హస్తగతం చేసుకున్నారు. దీంతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం తొలుత దక్షిణాది రాష్ట్రాలకు, ఆ తర్వాత సౌదీ అరేబియాకు తరలిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి అమెరికా మద్దతుతో సౌదీ నేతృత్వంలోని కూటమి 2015 మార్చిలో యుద్ధంలోకి ప్రవేశించింది.

హౌతీ స్థావరాలపై అనేక సార్లు వైమానిక దాడులు జరిపింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో యెమెన్​లో తీవ్రమైన మానవతా సంక్షోభం (Yemen Humanitarian Crisis) ఏర్పడింది.

ఇదీ చదవండి:ఐసిస్​పై తాలిబన్ల రివెంజ్​- అనేక మంది హతం!

ABOUT THE AUTHOR

...view details