తెలంగాణ

telangana

ETV Bharat / international

చమురు ఉత్పత్తి పెంపునకు ఒపెక్ దేశాలు ఓకే - జనవరి నుంచి పెరగనున్న చమురు ఉత్పత్తి

కరోనా కారణంగా తగ్గించిన ముడి చమురు ఉత్పత్తిని క్రమంగా మళ్లీ పెంచేందుకు ఒపెక్ దేశాలు సిద్ధమయ్యాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 5 లక్షల బ్యారెళ్ల ఉత్పత్తి పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకున్నాయి. జనవరి తర్వాత డిమాండ్​కు తగ్గట్లు ఉత్పత్తిలో సవరణల కోసం నెలవారీ సమావేశాలకు అంగీకారం తెలిపాయి.

Opec countries ready increase Oil output
చమురు ఉత్పత్తికి ఒపెక్ దేశాలు అంగీకారం

By

Published : Dec 4, 2020, 3:28 PM IST

ప్రపంచవ్యాప్తంగా చమురు డిమాండ్ నెమ్మదిగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పెట్రోలియం ఎక్స్‌పోర్టింగ్‌ కంట్రీస్‌(ఒపెక్​) దేశాలు, ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. 2021 జనవరి నుంచి రోజుకు 5 లక్షల బ్యారెళ్ల చమురు ఉత్పత్తి పెంచాలని నిర్ణయించాయి.

దీనితో రోజువారీ ప్రాతిపదికన ప్రస్తుతమున్న 7.7 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత.. వచ్చే ఏడాది మొదటి నెలలో 7.2 మిలియన్ బ్యారెళ్లకు తగ్గనుంది.

రానున్న నెలల్లో ఉత్పత్తి సవరణలను నిర్ణయించేందుకు నెలవారీ మంత్రిత్వ స్థాయి సమావేశాలకు ఒపెక్​ దేశాలు అంగీకరించాయి.

ఉత్పత్తి కోతకు ఒప్పందమిలా..

కోరోనా నేపథ్యంలో భారీగా పడిపోయిన డిమాండ్ కారణంగా.. ముడిచమురు ఉత్పత్తిలో కోత విధించాలని ఒపెక్ దేశాలు ఏప్రిల్​లో నిర్ణయం తీసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి దశలో రోజుకు 9.7 మిలియన్ బ్యారెళ్ల కోత విధించాయి. ఆగస్టు నుంచి ప్రారంభమైన రెండో దశ ప్రకారం.. ప్రస్తుతం రోజుకు 7.7 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి కోత విధిస్తున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఇది కొనసాగనుంది.

ఇదీ చూడండి:మూడో రోజూ పెరిగిన పెట్రోల్​, డీజిల్ ధరలు

ABOUT THE AUTHOR

...view details