తెలంగాణ

telangana

ETV Bharat / international

టర్కీ విమాన ప్రమాదంలో ఒకరు మృతి.. 157 మందికి గాయాలు - టర్కీ

టర్కీ ఇస్తాంబుల్​ విమానాశ్రయంలో ప్రమాదానికి గురైన విమాన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 157 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో విహాంగంలో 171 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదంలో విమానం మూడు ముక్కలైంది.

One dead in Turkey plane accident
టర్కీ విమాన ప్రమాదం

By

Published : Feb 6, 2020, 5:36 AM IST

Updated : Feb 29, 2020, 8:52 AM IST

టర్కీ ఇస్తాంబుల్​ విమానాశ్రయంలో రన్​వేపై జారి ప్రమాదానికి గురైన విమాన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 157 మందికి గాయాలయ్యాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆ దేశ ప్రభుత్వం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి ఫహ్రెటిన్​ కోకా తెలిపారు.

"ప్రస్తుతం గాయపడిన 157 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మా పౌరులలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు."

- ఫహ్రెటిన్​ కోకా, టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి

ఇదీ జరిగింది..

పెగాసస్​ ఎయిర్​లైన్స్​కు చెందిన విమానం ఇస్తాంబుల్​లోని సబిహా గోకెన్​ విమానాశ్రయంలో దిగే సమయంలో రన్​వేపై పక్కకు జారి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విహాంగం మూడు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. బలమైన గాలులు, వర్షం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు వెల్లడించారు. విమానం ఐజ్మిర్ నగరం నుంచి వచ్చినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 177మంది ప్రయాణికులు.. రెండు ముక్కలైన విమానం

Last Updated : Feb 29, 2020, 8:52 AM IST

ABOUT THE AUTHOR

...view details