తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇజ్రాయెల్​ నౌకలో పేలుడు ఇరాన్​ పనే' - israel pm

ఇరాన్​పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు తీవ్ర ఆరోపణలు చేశారు. గత వారం తమ దేశ కార్గో నౌకలో జరిగిన పేలుడుకు ఇరానే కారణమన్నారు. ఆ దేశం ఇజ్రాయెల్​కు అతి పెద్ద శత్రువు అని వ్యాఖ్యానించారు.

benjamin
'ఆ పేలుడుకు ఇరానే కారణం'

By

Published : Mar 1, 2021, 12:30 PM IST

Updated : Mar 1, 2021, 1:10 PM IST

ఇజ్రాయెల్​ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు ఇరాన్​పై మండిపడ్డారు. గల్ఫ్​ ఆఫ్​ ఒమన్​లో తమ నౌక ప్రమాదానికి గురవడానికి కారణం ఇరాన్​ అని ఆరోపించారు. నౌకపై దాడి చేయించింది ఆ దేశమేనని పేర్కొన్నారు.

ఇజ్రాయెల్​కు చెందిన ఎంవీ హెలియోస్​ రే అనే కార్గో నౌకలో శుక్రవారం అనుమానాస్పద రీతిలో పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో బెంజమిన్​ సోమవారం ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఇరాన్..​ ఇజ్రాయెల్​కు అతిపెద్ద శత్రువు. ఈ ప్రమాదానికి కారణం ఇరాన్​ అని స్పష్టంగా తెలుస్తోంది. వారిపై అన్ని విధాలా ప్రతిఘటిస్తాము."

-బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని

పేలుడు కారణంగా నౌక కుడి, ఎడమ భాగాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. అందులోని బృందం సురక్షితంగా బయటపడింది. మరమ్మతుల కోసం నౌకను ఆదివారం దుబాయ్​ పోర్టుకు తరలించారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు చేపడుతున్నారు. సింగపూర్​కు వెళ్తున్న ఈ నౌక.. వివిధ ప్రాంతాలకు కార్లను రవాణా చేస్తోందని సమాచారం.

వైమానిక దాడులు..

నౌక ఘటనకు ప్రతిఘటనగా ఇజ్రాయెల్​ సిరియా సరిహద్దు వద్ద వైమానిక దాడులు జరిపింది. ఈ దాడిని సిరియా ఖండించగా.. ఆ ప్రాంతంలో ఉన్న ఇరాన్​ స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిపారని అని ఇజ్రాయెల్​ మీడియా పేర్కొంది. నౌక ఘటనకు ప్రతి చర్యగా ఈ దాడులు చేపట్టినట్టు స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్​ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇరాన్​ కూడా ఇజ్రాయెల్​ ఆరోపణలపై మౌనం వహించింది. ఇజ్రాయెల్​ ఇరాన్​ మధ్య ఉన్న వివాదల నేపథ్యంలో.. ఈ ఘటన పశ్చిమాసియాలోని​ జలమార్గాలలో భద్రతపై సందేహాలు వ్యక్తం అయ్యేలా చేస్తోంది.

ఇదీ చదవండి :ట్రక్కు, రెండు కార్లు ఢీ- 9 మంది మృతి

Last Updated : Mar 1, 2021, 1:10 PM IST

ABOUT THE AUTHOR

...view details