తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ ఘన విజయం! - ఇరాన్ అధ్యక్షుడు

ఇరాన్ అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ విజయం సాధించారు. రెండో స్థానంలో ఉన్న నేతతో పోలిస్తే భారీ ఆధిక్యం దక్కించుకున్నారు. ఈ ఫలితాలను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రెండో స్థానంలో ఉన్న రెజాయి తన ఓటమిని ఒప్పుకున్నారు.

raisi iran president
ఇరాన్ అధ్యక్షుడిగా రైసీ

By

Published : Jun 19, 2021, 2:25 PM IST

ఇరాన్ అధ్యక్షుడిగా ఆ దేశ న్యాయశాఖ అధిపతి ఇబ్రహీం రైసీ ఘన విజయం సాధించారు. ప్రాథమిక ఫలితాల్లో రైసీకి 1.78 కోట్ల లభించాయి. ఆయన సమీప ప్రత్యర్థి రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మోహ్​సెన్ రెజాయి 33 లక్షలు, అబ్దోల్​ నాసీర్ హెమతి 24 లక్షల ఓట్లు దక్కించుకున్నట్లు ఇరాన్ అంతర్గత వ్యవహారాల శాఖ హెడ్ జమాల్ ఓర్ఫ్ వెల్లడించారు.

ఇబ్రహీం రైసీ

అయితే, అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ఇరాన్ ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, రెండు, మూడు స్థానాల్లో నిలిచిన రెజాయి, హెమతి తమ పరాజయాన్ని ఒప్పుకున్నారు. ఇన్​స్టాగ్రామ్ వేదికగా రైసీకి హెమతి అభినందనలు తెలిపారు.

తనకు కఠిన ప్రత్యర్థిగా ఉన్న నేతను అనర్హుడిగా ప్రకటించిన తర్వాతే రైసీ పోటీలో మెరుగైన ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది. రైసీ ఎన్నికైతే.. బాధ్యతలు చేపట్టక ముందే అమెరికా ఆంక్షలను ఎదుర్కొన్న తొలి ఇరాన్ అధ్యక్షుడిగా రికార్డు సృష్టిస్తారు. 1988లో జరిగిన రాజకీయ ఖైదీల సామూహిక హత్యల్లో రైసీ ప్రమేయం ఉందని అమెరికా ఆయనపై ఆంక్షలు విధించింది.

ఇదీ చదవండి:చైనా- ఇరాన్​ ఒప్పందం- భారత విధానాలకు ముప్పు!

ABOUT THE AUTHOR

...view details