ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మేకప్ లేకుండా చూసి అవాక్కయ్యాడు ఓ భర్త. ఆమె సహజమైన అందాన్ని చూసి బిత్తరపోయాడు. ఇన్నాళ్లు తాను ప్రేమించిన అందగత్తె ఈమేనా అని వాపోయాడు. వివాహమైన మర్నాడే అతనికి ఈ విచిత్ర పరిస్థితి ఎదురైంది.
ఈజిప్టుకు చెందిన ఈ వ్యక్తికి కొద్దిరోజుల క్రితం ఓ అమ్మాయితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. రోజూ చాటింగ్ చేసుకుని ఇద్దరూ దగ్గరయ్యారు. ఆమె అందాన్ని ఫొటోల్లో చూసి అతడు మంత్రముగ్ధుడయ్యాడు. ఆమెను నేరుకు కలిసేందుకు తహతహలాడాడు. పలుమార్లు డేటింగ్‌కు కూడా వెళ్లాడు. పెళ్లంటూ చేసుకుంటే ఇలాంటి అందగత్తెనే చేసుకోవాలనుకున్నాడు. ఎలాగోలా ఆమెను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లైన మర్నాడే అమె అసలు అందం చూసి మనోడు కంగుతిన్నాడు. మేకప్ లేకుండా ఆమెను దగ్గరి నుంచి అస్సలు చూడలేకపోయాడు. 'నిన్నమొన్నటి వరకు నేను చూసింది ఈమెనేనా?' అనుకున్నాడు. మేకప్ లేకుండా తన భార్య అందంగా కనిపిస్తుందేమోనని నెల రోజుల వరకు ఎదురు చూశాడు. ఇక ఫలితం లేకా తనతో కలిసి ఉండలేనని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు.