తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రజాగ్రహంతో లెబనాన్​ ప్రధాని  రాజీనామా

బీరుట్​లో భారీ పేలుడు ఘటనపై చెలరేగిన నిరసనల నేపథ్యంలో లెబనాన్ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఈ మేరకు ప్రధాని, ఆయన మంత్రివర్గం రాజీనామా లేఖలు సమర్పించారు.

Lebanese Cabinet
లెబనాన్​ కేబినెట్

By

Published : Aug 10, 2020, 10:57 PM IST

Updated : Aug 11, 2020, 5:42 AM IST

బీరుట్​లో జరిగిన భారీ పేలుళ్ల నేపథ్యంలో లెబనాన్ ప్రధాన మంత్రి హసన్​ దియాబ్​, ఆయన మంత్రివర్గం సోమవారం రాజీనామా చేశారు.​ ఘటనపై పెల్లుబికిన ప్రజాగ్రహంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అధ్యక్ష భవనానికి వెళ్లి ప్రధాని తన మంత్రివర్గ రాజీనామాను సమర్పించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై సుదీర్ఘ మంతనాలు జరిగే అవకాశముంది.

లెబనాన్​కు ఔషధాలు, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువులు తక్షణం పంపనున్నట్లు భారత్​ తెలిపింది. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి టి.ఎస్​ తిరుమూర్తి ఈ విషయాన్ని వెల్లడించారు.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు..

లెబనాన్​లో ఆగస్టు 4న జరిగిన భారీ పేలుడుకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు చేపట్టారు ప్రజలు. బీరుట్​లోని ప్రభుత్వ కార్యాలయాలను చుట్టుముట్టేందుకు ప్రయత్నించారు. చాలా చోట్ల ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు బాష్పవాయువును ప్రయోగించాయి.

లెబనాన్​లో 1990ల్లో జరిగిన పౌర ఉద్యమం తర్వాత ప్రస్తుత అధికార పార్టీనే పాలిస్తోంది. అయితే దియాబ్ ఇష్టం లేకపోయినా రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జాతినుద్దేశించి మాట్లాడిన దియాబ్​.. సంస్కరణలను ప్రవేశపెట్టేందుకు రెండు నెలల సమయం కావాలని కోరారు. అయితే సొంత కేబినెట్​ నుంచే ఒత్తిడి తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:సూపర్​ మార్కెట్లో 'బీరుట్​ పేలుళ్ల' భయానక దృశ్యాలు

Last Updated : Aug 11, 2020, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details