తెలంగాణ

telangana

ETV Bharat / international

Latakia Port Attack: సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్​ ​క్షిపణి దాడి

Latakia Port Attack: ఇజ్రాయెల్​.. తమ దేశంలోని నౌకాశ్రయంపై క్షిపణులతో దాడిచేసిందని సిరియా వెల్లడించింది. లటాకియా పోర్ట్​లోని కంటైనర్ ప్రాంతమే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు పేర్కొంది.

Latakia Port Attack
లటాకియా నౌకాశ్రయం

By

Published : Dec 7, 2021, 9:03 AM IST

Latakia Port Attack: సిరియాలోని లటాకియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్​ యుద్ధవిమానాలు క్షిపణుల దాడి చేసినట్లు ఆ దేశం తెలిపింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదని స్పష్టంచేసింది. పోర్ట్​లోని కంటైనర్ ప్రాంతంలో అనేక క్షిపణులను ఇజ్రాయెల్ ప్రయోగించిందని సిరియాకు చెందిన ఓ మిలిటరీ అధికారి.. స్థానిక మీడియాసంస్థకు వివరించారు. ఇదే విషయంపై పూర్తివివరాలను మాత్రం వెల్లడించలేదు.

లటాకియా నౌకాశ్రయంలో ఎగిసిపడుతున్న మంటలు

లటాకియా పోర్ట్​పై ఇది ఒక అరుదైన దాడిగా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఈ నౌకాశ్రయం నుంచే సిరియా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు దేశవ్యాప్తంగా సరఫరా అవుతాయి. లటాకియా పోర్ట్​లో మొత్తం ఐదు పేలుళ్లు జరిగినట్లు సిరియాలోని టీవీ తెలిపింది. కంటైనర్​లు ఉన్నప్రాంతంలో పెద్దఎత్తున మంటలు చెలరేగినట్లు పేర్కొంది. అయితే ఈ ఘటనపై ఇజ్రాయెల్ ప్రభుత్వం స్పందించలేదు.

Syria Israel War: గతకొన్నేళ్లుగా సిరియా, ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే వందలసార్లు ఇజ్రాయెల్​ క్షిపణిలు.. సిరియాపై దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్​లోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగానూ గతంలో దాడులు జరిగాయి. అయితే సిరియాలో ఉన్న ఇరాన్​ ఫైటర్స్​పైనే తాము దాడులు జరిపామని ఇజ్రాయెల్ వెల్లడిస్తూ వస్తోంది.

ఇదీ చూడండి:కరోనా రూల్స్ బ్రేక్ చేసినందుకు ఆంగ్​సాన్​ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష

ABOUT THE AUTHOR

...view details