అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. తాలిబన్ల రాక్షస పాలన(Afghan crisis)ను తట్టుకునే ఓపిక లేక ఎలాగైనా దేశం దాటి వెళ్లిపోతున్నారు. వేల మంది ఇప్పటికే పలు దేశాలకు తరలిపోయారు. ఇంకా అనేక మంది కాబుల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. ప్రజలు ముగురు కాలువలోకి దిగి అమెరికా సైనికులను(us troops in afghanistan) అభ్యర్థిస్తున్న ఓ వీడియో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
దాదాపు 4వేల మంది అమెరికా సైనికులు కాబుల్ విమానాశ్రయం(kabul airport) వద్ద విధులు నిర్వహిస్తున్నారు. సరైన పత్రాలు ఉంటేనే విమానాశ్రయం లోపలికి అనుమతిస్తున్నారు. అయితే విమానాల రాకపోకలు పరిమితం కావడంతో వేల మంది ఎయిర్‌పోర్టు బయటే ఉండి తమ వంతు కోసం వేచిచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని విమానాశ్రయం లోపలికి అనుమతించాలని అమెరికా సైనికులను(us troops in afghanistan) కోరుతున్నారు. ఎయిర్‌పోర్ట్ గోడకు సమీపంలో ఉన్న మురుగు నీటి కాలువలోకి దిగి అనేక మంది అఫ్గాన్లు తమ వద్ద ఉన్న పత్రాలను చూపిస్తున్న వీడియో అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.