తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదు: ఇరాన్​ - ఇరాన్​ జాతీయ భద్రత కౌన్సిల్​.

అమెరికా తన క్షిపణులతో ఇరాన్​ జనరల్ ఖాసిం సులేమానీని హత్య చేసినందున ఆ దేశానికి చెందిన పలువురు ప్రముఖులు అగ్రరాజ్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సులేమానీ హత్యకు అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు హిజ్బుల్లా ఛీప్​ హసన్​.

khamenei-adviser-says-iran-response-to-us-to-be-military
అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదు: ఇరాన్​

By

Published : Jan 5, 2020, 11:27 PM IST

జనరల్ ఖాసిం సులేమానీని హత్య చేసినందుకు అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదని లెబనాన్ షియా ఉద్యమ హిజ్బుల్లా సంస్థ చీఫ్​ హసన్​ నస్రాల్లా హెచ్చరించారు. ఈ వివాదంపై ఇరాన్​కు చెందిన పలు సంస్థలు, ప్రముఖులు ఈ విధంగా స్పందించారు.

"అమెరికా సైన్యం సులేమానీని హతమార్చింది. దీనికి అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించక తప్పదు."
-హసన్ నస్రాల్లా, హిజ్బుల్లా చీఫ్​

"ఇరాన్​ టాప్​ కమాండర్​ సులేమానీని చంపిన అమెరికాకు సైనికులే సమాధానం చెబుతారు."
-ఇరాన్​ సుప్రీం లీడర్ సలహాదారుడు

"అమెరికా సైనికుల, సైనిక స్థావరాలపై ప్రతి చర్య కచ్చితంగా ఉంటుంది.
-హుస్సేన్ డెహగాన్, బ్రిగేడియర్ జనరల్

"ఇరాన్​ను యుద్ధాన్ని కోరుకోవటం లేదు. కానీ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. తుది నిర్ణయం నాయకులపై ఆధారపడి ఉంది."
-అబ్బాస్​ మౌసావి, ఇరాన్​ విదేశాంగ ప్రతినిధి

"సరైన సయయంలో, సరైన ప్రదేశంలో సులేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం."
-ఇరాన్​ జాతీయ భద్రత కౌన్సిల్​

ఇరాన్​ మాజీ మంత్రి ఓ ప్రముఖ ఛానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

"యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికా. తన చర్యకు, ప్రతి చర్యను స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఈ యుద్ధం ముగియాలంటే ఇరాన్​ ఎంత బాధను అనుభవించిందో, అదే విధంగా అగ్రరాజ్యం కూడా సమానమైన బాధను అనుభవించాలి."

-డెహగాన్, ఇరాన్​ మాజీ రక్షణ మంత్రి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​... ఇరాన్​ దేశంతో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. అనంతరం ఆ దేశంపై తీవ్ర స్థాయిలో ఆంక్షలు విధించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదీ చూడండి:మరోసారి జేఎన్​యూలో ఉద్రిక్తత.. విద్యార్థులపై దాడి

ABOUT THE AUTHOR

...view details