తెలంగాణ

telangana

ETV Bharat / international

పిల్లిని కాపాడారు.. రూ.10లక్షలు గెలిచారు! - దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బీన్ రషీద్ అల్ మక్తూమ్​

ఓ పిల్లిని రక్షించిన కొందరు వ్యక్తులకు ఊహించని బహుమతి లభించింది. గర్భంతో ఉన్న ఓ పిల్లి భవనంపై నుంచి కిందపడుతుండగా సమయస్ఫూర్తి ప్రదర్శించిన నలుగురికి రూ.10 లక్షల రివార్డును అందించారు.

pregnant cat
pregnant cat

By

Published : Aug 28, 2021, 7:09 PM IST

గర్భంతో ఉన్న ఓ పిల్లి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోతుండగా రక్షించిన ఓ బృందాన్ని అదృష్టం వరించింది. మానవతా దృక్పథంతో వారు స్పందించిన ఈ ఘటన దుబాయ్‌లో జరిగింది. సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయిన ఈ వీడియో దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బీన్ రషీద్ అల్ మక్తూమ్​ను కూడా ఆకర్షించింది. ఆయన దీనిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

ఇదీ జరిగింది..

ఓ భవనం బాల్కనీలో ప్రమాదకరంగా వేలాడుతున్న ఓ పిల్లిని సాహిబ్ అనే డ్రైవర్ గుర్తించి మిగతా వారిని అప్రమత్తం చేశాడని స్థానికులు తెలిపారు. అది కిందపడిపోయే సమయానికి ఓ దుప్పటి తీసుకొచ్చి వారంతా సిద్ధంగా ఉన్నారని.. సమయస్ఫూర్తితో వ్యవహరించారని కొనియాడారు. ప్రస్తుతం పిల్లి ఆరోగ్యం బాాగానే ఉందని తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన అతిఫ్ మెహమూద్, మొరాకోకు చెందిన సెక్యూరిటీ గార్డు అష్రఫ్ కేరళ వాసులకు సహకరించారు.

భవనంపై ప్రమాదకరంగా పిల్లి
కిందపడుతున్న పిల్లి

"మన అందమైన నగరంలో ఇలాంటి మానవతా దృక్పథం కలిగిన వ్యక్తుల చొరవను చూసి గర్విస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. వెలుగులోకి రాని ఈ హీరోల గురించి ఎవరికైనా తెలిస్తే.. దయచేసి వారికి ధన్యవాదాలు తెలియజేయండి" అంటూ దుబాయ్ రాజు పోస్ట్ చేశారు. పిల్లి పడిపోతుండగా తక్షణమే స్పందించిన తీరు, చూపిన శ్రద్ధకు మెచ్చి రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఆ పిల్లిని రక్షించిన బృందంలో కేరళకు చెందిన నాసర్ శిహాబ్, మహమ్మద్ రషీద్​లు కూడా ఉన్నారు.

దుప్పటిలో పిల్లిని పట్టుకున్న బృందం
పిల్లిని చేరదీస్తూ

పిల్లిని కాపాడేందుకు ఈ బృందం చేసిన ప్రయత్నాలను ప్రశంసిస్తున్న నెటిజన్లు.. వారిని హీరోలుగా అభివర్ణిస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details