తెలంగాణ

telangana

ETV Bharat / international

గృహ నిర్బంధంలో జోర్డాన్​ మాజీ యువరాజు!

తనను గృహ నిర్బంధం చేశారని జోర్డాన్​ మాజీ యువరాజు హంజా బిన్ హుస్సేన్ ​ఆరోపించారు. ఫోన్​లైన్స్​, ఇంటర్నెట్​ సదుపాయం లేకుండా చేశారని చెప్పారు. ఈ మేరకు ఓ శాటిలైట్​ ఇంటర్నెట్​ ద్వారా వీడియో సందేశంలో హంజా వెల్లడించారు.

Jordan prince
గృహ నిర్బంధంలో జోర్డాన్​ మాజీ యువరాజు

By

Published : Apr 4, 2021, 7:33 AM IST

Updated : Apr 4, 2021, 8:47 AM IST

చక్రవర్తి అబ్దుల్లా-2 సోదరుడు, జోర్డాన్​ మాజీ యువరాజు హంజా బిన్ హుస్సేన్ తనను గృహ నిర్బంధం చేశారని ఆరోపించారు. జోర్డాన్​లో పలువురు ప్రముఖులు సహా రాజకుటుంబంలోని వివిధ వ్యక్తులను ఇటీవల అక్కడి చక్రవర్తి అరెస్టు చేయించారని చెప్పారు. ఇందులో భాగంగానే తనను, తన భార్యాబిడ్డలనూ గృహనిర్బంధం చేశారని ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

"నా స్నేహితులు సహా ఎంతో మందిని అరెస్టు చేశారు. నా భద్రతను తొలగించారు. ఇంటర్నెట్​, ఫోన్​ లైన్స్​ను తొలగించారు. శాటిలైట్​ ఇంటర్నెట్​ సాయంతో నేను ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాను. బహుశా ఇకపై నేను ఎవరితోనూ మాట్లాడలేకపోవచ్చు."

- హంజా బిన్ హుస్సేన్​, జోర్డాన్​ మాజీ యువరాజు.

వీడియోలో ఉన్నది ప్రిన్స్​ హంజా బిన్ హుస్సేనే అని అంతర్జాతీయ న్యాయవాది మాలిక్​ ఆర్​.దహ్లాన్​ ధ్రువీకరించారు. తాను ఏ కుట్రలో భాగస్వామిని కానని, ఏ విదేశీ సమూహాల్లో భాగం కాదని చెప్పేందుకే ఈ వీడియో రికార్డ్​ చేస్తున్నట్లు హంజా బిన్ తెలిపారు.

అబ్దుల్లాకు సౌదీ అరేబియా, అమెరికా మద్దతు..

దేశాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేశారన్న ఆరోపణల కింద తన సోదరుడు హంజా బిన్ హుస్సేన్​ను అబ్దుల్లా ప్రశ్నిస్తున్నారని వస్తున్న వార్తలపై అమెరికా విదేశాంగ శాఖ స్పందించింది. జోర్డాన్​ చక్రవర్తి కింగ్​ అబ్దుల్లా-2.. తమకు కీలకమైన భాగస్వామి అని పేర్కొంది. అబ్దుల్లాకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపింది.

సౌదీ అరేబియా కూడా అబ్దుల్లాను సమర్థించింది. జోర్డాన్​ భద్రత విషయంలో అబ్దుల్లా తీసుకున్న నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

ఇదీ చూడండి:ఆన్​లైన్​లో 50 కోట్ల ఫేస్​బుక్​ యూజర్ల డేటా

Last Updated : Apr 4, 2021, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details