తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2021, 5:30 AM IST

ETV Bharat / international

ఒకే వేదికపై జోర్డాన్​ చక్రవర్తి, హంజా

జోర్డాన్ చక్రవర్తి అబ్దుల్లా-2, మాజీ యువరాజు హంజా ఆదివారం ఒకే వేదికపై కనిపించారు. ఈ ఫొటోను రాయల్​ ప్యాలెస్ విడుదల చేసింది.

jordan's royal rift
ఒకే వేదికపై జోర్డాన్​ చక్రవర్తి, మాజీ యువరాజు హంజా

జోర్డాన్ చక్రవర్తి అబ్దుల్లా-2, ఆయన సోదరుడు ప్రిన్స్ హంజా ఆదివారం ఒకే వేదికపై కనిపించారు. వారం రోజులుగా రాజకుటుంబంలో సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో ఈ అనూహ్య పరిణామం ఆసక్తికరంగా మారింది. ఇరువురితో పాటు యువ చక్రవర్తి హుస్సేన్, ఇతర రాజకుటుంబీకులున్న ఫొటోను రాయల్ ప్యాలెస్ విడుదల చేసింది.

ఆదివారం జోర్డాన్ రాజధాని అమ్మాన్​లో కింగ్​ తలాల్​ సమాధి వద్ద చక్రవర్తి అబ్దుల్లా-2, మాజీ యువరాజు ప్రిన్స్ హంజా కలిశారు.

ఇదీ చదవండి:గృహ నిర్బంధంలో జోర్డాన్​ మాజీ యువరాజు!

గృహ నిర్భందం!

జోర్డాన్​ మాజీ యువరాజు హంజా బిన్ హుస్సేన్ తనను గృహ నిర్బంధం చేశారని ఇటీవలే ఆరోపించారు. జోర్డాన్​లో పలువురు ప్రముఖులు సహా రాజకుటుంబంలోని వివిధ వ్యక్తులను ఇటీవల అక్కడి చక్రవర్తి అరెస్టు చేయించారని చెప్పారు. ఇందులో భాగంగానే తనను, తన భార్యాబిడ్డలనూ గృహనిర్బంధం చేశారని ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఆదివారం ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం గమనార్హం.

ఇదీ చదవండి:'దేశాన్ని అస్థిరపరిచేందుకే ప్రిన్స్​ హంజా కుట్ర'

ABOUT THE AUTHOR

...view details