Jordan drug smugglers killing: మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో 27 మందిని జోర్డాన్ సైన్యం కాల్చి చంపింది. సిరియా నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా.. వారిని హతమార్చినట్లు జోర్డాన్ సైన్యం వెల్లడించింది.
అనేకసార్లు డ్రగ్స్ అక్రమ సరఫరా యత్నాలను అడ్డుకున్నామని తెలిపిన జోర్డాన్ సైన్యం.. పెద్ద ఎత్తున నార్కోటిక్స్‌ను సీజ్ చేశామని తెలిపింది. సరిహద్దు నుంచి అక్రమంగా చొరబాట్లకు పాల్పడిన వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కొంతమంది అనుమానిత స్మగ్లర్లు దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని.. వారిని జవాన్లు కాల్చి చంపారని సైన్యం తెలిపింది.