తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆగని దాడులు- గాజా ప్రజలు విలవిల

గాజాపై ఇజ్రాయెల్​ మరోమారు వాయుదాడులతో విరుచుకుపడింది. హమాస్​ ఉగ్రవాదుల నివాసాలే లక్ష్యంగా తాజా దాడులను జరిపింది. ఈ ఘటనలో అనేకమంది గాయపడ్డారు. ఈ దాడులతో ఇజ్రాయెల్​- పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాలని ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నం విఫలమవుతోంది.

Israel unleashes strikes after vowing to press on in Gaza
ఆగని దాడులు- గాజా ప్రజలు విలవిల

By

Published : May 20, 2021, 3:55 PM IST

Updated : May 20, 2021, 4:26 PM IST

ఆగని దాడులు- గాజా ప్రజలు విలవిల

పాలస్తీనాతో ఉద్రిక్తతలు తగ్గించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఇచ్చిన పిలుపును ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుతిరస్కరించిన కొద్ది గంటలకు గాజాపై వాయు దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ ఘటనలో ఒకరు మరణించగా అనేకమంది గాయపడినట్టు తెలుస్తోంది.

దద్దరిల్లిన గాజా

నలుగురు హమాస్​ కమాండర్ల నివాసాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్టు ఇజ్రాయెల్​ మిలిటరీ వెల్లడించింది. ఆ నివాసాల్లో ఉన్న ఆయుధాల నిల్వలను, మిలిటరీకి చెందిన మౌలికవసతులను ధ్వంసం చేయడానికే దాడులు చేసినట్టు స్పష్టం చేశారు.

దాడులతో దట్టంగా అలుముకున్న పొగ

తాజా దాడులతో గాజా దద్దరిల్లింది. ముఖ్యంగా ఖాన్​ యూనిస్​, అల్​-సాఫ్టవి ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సొంత నివాసాలకు దూరంగా ఉంటున్నారు.

దాడుల్లో ధ్వంసమైన ఇల్లు

పరిస్థితి విషమం...

పాలస్తీనా-ఇజ్రాయెల్​ మధ్య పరిస్థితి రోజురోజుకు ముదురుతోంది. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో 227మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 64మంది చిన్నారులు, 38మంది మహిళలు ఉన్నారు. 1,620మందికిపైగా మంది క్షతగాత్రులయ్యారు. 20మంది హమాస్​, ఇస్లామిక్​ జిహాద్​ సభ్యులు మరణించారు. మొత్తం మీద 58వేల మంది ఇళ్లను విడిచి వసలవెళ్లిపోయారు.

సరిహద్దులో ఇజ్రాయెల్​ సైన్యం

పాలస్తీనా నిరసనకారులు, ఇజ్రాయెల్​ పోలీసులు మధ్య ఇటీవలే చెలరేగిన ఘర్షణలు రెండు దేశాలను యుద్ధం అంచుకు నెట్టాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్​ మిలిటరీ- హమాస్​ ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు రాకెట్​ దాడులతో విరుచుకుపడుతున్నారు. ఈ పరిస్థితులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నించాలని, మిత్రదేశమైన ఇజ్రాయెల్​పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ బుధవారం ఒత్తిడిపెంచారు. వీటిని పక్కనపెట్టి, ఇజ్రాయెల్​లో శాంతి, భద్రతలను స్థాపించేంతవరకు దాడులను ఆపబోమని స్పష్టం చేశారు నెతన్యాహు.

ఇదీ చూడండి:-ఇజ్రాయెల్ దాడుల్లో 6 నెలల మృత్యుంజయుడు!

Last Updated : May 20, 2021, 4:26 PM IST

ABOUT THE AUTHOR

...view details