తెలంగాణ

telangana

ETV Bharat / international

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడి

గాజాపై మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. గాజా నుంచి దక్షిణ ఇజ్రాయెల్​ ప్రాంతానికి పేలుడు బెలూన్లను ప్రయోగించారని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు తెలిపారు. అందువల్ల తాము ప్రతి దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయెల్- గాజాల మధ్య మే 21న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

Israel launches air strike
ఇజ్రాయెల్ వైమానిక దాడి

By

Published : Jun 16, 2021, 7:46 AM IST

Updated : Jun 16, 2021, 8:14 AM IST

ఇజ్రాయెల్- గాజాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెలరోజులు కూడా కాకముందే బుధవారం ఇరు వర్గాల మధ్య మరోసారి యుద్ధ ఛాయలు కనిపించాయి. తమ భూభాగంలోకి పేలుడు బెలూన్లను వదిలారని ఆరోపించిన ఇజ్రాయెల్.. గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన చేసింది.

"మేము హమాస్​ కాంపౌండ్​లో దాడి చేశాము. రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం."

-- ఇజ్రాయెల్ ఆర్మీ

గాజా నగరం, సిటీ ఆఫ్​ ఖాన్​ యూనిస్​పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు స్పుత్నిక్​ మీడియా పేర్కొంది. గతనెలలో 11 రోజుల పాటు పాలస్తీనాలోని హమాస్‌ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య సంఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాకెట్​ దాడులు చేసుకున్నాయి.

ఇదీ చదవండి :గాజాపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం
కొత్త ప్రభుత్వంతో ఇజ్రాయెల్​ పునర్నిర్మాణం జరిగేనా?

Last Updated : Jun 16, 2021, 8:14 AM IST

ABOUT THE AUTHOR

...view details