పెగసస్ స్పైవేర్ తయారు చేసిన ఎన్ఎస్ఓ గ్రూప్‌ను (NSO group) అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం సహా.. అంతర్జాతీయంగా ఈ సంస్థపై వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎన్ఎస్ఓ గ్రూప్‌తో (NSO Pegasus) ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించింది. ఎన్ఎస్ఓ ఓ ప్రైవేటు సంస్థ మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ కంపెనీకి ఇజ్రాయెల్ గుర్తింపు ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వ విధానాలతో ఎన్ఎస్ఓ గ్రూప్‌నకు ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్, ఆర్థిక మంత్రి ఆవిగ్డోర్ లిబర్మన్తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
సైబర్ రంగంలో ఇజ్రాయెల్ కఠిన నిబంధనలు అమలు చేస్తోందని లాపిడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో మరే ఇతర దేశం కూడా ఇలాంటి నిబంధనలు పాటించడం లేదని చెప్పారు. ఈ నిబంధనలను ఇంతే కఠినంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అమెరికా ఆంక్షలు
స్పైవేర్‌ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఎన్ఎస్ఓ గ్రూప్‌ను (NSO Group Pegasus) బ్లాక్‌లిస్ట్‌లోకి చేర్చింది అమెరికా. జాతి భద్రత, విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోందని పేర్కొంది. స్పైవేర్‌ను విదేశాల్లోని ప్రభుత్వాలకు సరఫరా చేసి.. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్ట్‌లు, వ్యాపారవేత్తలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు, రాయబారులపై నిఘా వేశారని ప్రకటనలో తెలిపింది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి నియంతృత్వ ప్రభుత్వాలు.. తమపై అసమ్మతి వ్యక్తం చేసేవారిని అణచివేశాయని పేర్కొంది. ఇలాంటి కార్యకలాపాలు అంతర్జాతీయ విధానాలకు భంగం కలిగిస్తాయని అభిప్రాయపడింది.
పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ నిఘా!