తెలంగాణ

telangana

ETV Bharat / international

'రావత్​ నిజమైన నాయకుడు-మంచి స్నేహితుడు' - రావత్​పై నేపాల్​ ప్రధాని

Rawat Helicopter Crash: సీడీఎస్​ బిపిన్​ రావత్​ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు ఇజ్రాయెల్​, నేపాల్​ ప్రధానులు. రావత్​ తమకు మంచి స్నేహితుడని ఇరు దేశాల ప్రధానులు పేర్కొన్నారు.

rawat
రావత్

By

Published : Dec 9, 2021, 7:20 PM IST

Rawat Helicopter Crash: హెలికాప్టర్​ ప్రమాదంలో దుర్మరణం చెందిన సీడీఎస్​ బిపిన్​ రావత్​ సహా 13 మంది అధికారుల కుటుంబాలకు సంతాపం తెలిపారు ఇజ్రాయెల్​ ప్రధాన మంత్రి నాఫ్తాలీ బెన్నెట్​. రావత్​ నిజమైన నాయకుడని.. ఇజ్రాయెల్​కు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ప్రధానితో పాటు ఇజ్రాయెల్​ రక్షణ మంత్రి బెన్నీ గాంట్స్​, విదేశాంగ మంత్రి యాయిర్​ లాపిడ్​ కూడా సంతాపం ప్రకటించారు.

నేపాల్​ ప్రధాని సంతాపం..

బిపిన్​ రావత్​ మృతిపట్ల నేపాల్ ప్రధాని షేర్​ బహదూర్​ దేవ్​బా సహా ఆర్మీచీఫ్​ జనరల్​ ప్రభురామ్​శర్మ సంతాపం వ్యక్తం చేశారు.

"జనరల్​ బిపిన్​ రావత్​, ఆయన సతీమణి సహా పలువురు సైన్యాధికారులు దుర్మరణం చెందడం బాధాకరం. వారి కుటుంబాలకు, భారత సైన్యానికి నా సంతాపం" అని దేవ్​బా ట్వీట్​లో పేర్కొన్నారు. నేపాల్​ సైన్యానికి నిజమైన స్నేహితుడు అన్నారు ఆర్మీ చీఫ్​ జనరల్​ ప్రభు రామ్​శర్మ. రావత్​ కుటుంబసభ్యులను ఫోన్​​ ద్వారా ఆర్మీచీఫ్​ పరామర్శించినట్లు నేపాల్​ సైన్యం వెల్లడించింది.

ఇదీ చూడండి :అక్కడ స్మోకింగ్​ బ్యాన్​- వారు జీవితకాలం సిగరెట్​ తాగలేరు!

ABOUT THE AUTHOR

...view details