ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో కొవిడ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ సిలిండర్ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 82కు పెరిగింది. మరో 110 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఇరాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 28 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు.
ఇబ్న్ అల్-ఖతీబ్ ఆస్పత్రిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలో చాలా వరకు కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.