ఇరాన్ తన అణు కార్యక్రమానికి మరింత పదును పెట్టింది. అత్యాధునిక న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్ ఐఆర్-9 పరీక్షలు శనివారం ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇరాన్ తొలిసారి వాడిన ఐఆర్-1 తో పోలిస్తే ఈ సెంట్రిఫ్యూజ్ 50 రెట్లు వేగంతో పనిచేస్తుంది. ఇది దేశ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తుంది.
'అణు' పరీక్షల్లో ఇరాన్ దూకుడు - ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు
ఇరాన్ తన అత్యాధునిక న్యూక్లియర్ సెంట్రిఫ్యూజ్ ఐఆర్-9 పరీక్షలను శనివారం ప్రారంభించింది. ఇది ఆ దేశ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని మరింత వేగం చేయనుంది. అయితే.. అణు ఒప్పందం విషయంలో ఇరాన్, అమెరికా మధ్య రాజీకి ప్రయత్నిస్తున్న దేశాలకు ఈ చర్య.. ఇబ్బందికర పరిస్థితేనని నిపుణులు చెబుతున్నారు.
అణు కార్యక్రమాల్లో ఇరాన్ దూకుడు
ఈ నేపథ్యంలో అణు ఒప్పందం విషయంలో ఇరాన్, అమెరికా మధ్య రాజీకి ప్రయత్నిస్తున్న రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా, యూరోపియన్ యూనియన్‌లకు ఇది ఇబ్బందికర పరిస్థితిగానే తెలుస్తోంది. 2018లో ఇరాన్ అణు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు.. ఇరాన్‌పై భారీగా ఆంక్షలు విధించారు.
ఇదీ చూడండి:తుపాకుల నియంత్రణపై బైడెన్ కీలక చర్యలు