తెలంగాణ

telangana

ETV Bharat / international

'తనిఖీదారులకు అణుకేంద్రాల ఫొటోలు ఇవ్వం' - ఇరాన్​ స్పీకర్​ మహ్మద్​ బగేల్​ కలిబాఫ్​

2015 అణు ఒప్పందం పునరుద్ధరణకు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో.. ఇరాన్​ తన వైఖరిని మరింత కఠినతరం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తనిఖీదారులకు ఎలాంటి ఫొటోలు, సమాచారం ఇవ్వమని స్పష్టం చేసింది.

Iran, Nuclear deal
ఇరాన్​

By

Published : May 24, 2021, 6:33 AM IST

2015 అణు ఒప్పందం పునరుద్ధరణకు చర్చలు జరుగుతున్న సమయంలో ఇరాన్​ తన వైఖరిని కఠినతరం చేసింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఐఈఏ) తనిఖీదారులకు తమ అణుకేంద్రాల ఫొటోలు, సమాచారం ఇవ్వమని ఆ దేశ పార్లమెంట్​ స్పీకర్​​ మహ్మద్​ బగేల్​ కలిబాఫ్​ అన్నారు. డిసెంబరులోనూ ఇలాంటి హెచ్చరికనే ఇరాన్​ జారీ చేసింది.

చమురు, బ్యాంకింగ్​ రంగాలపై విధించిన ఆంక్షలు తొలగించకపోతే ఫిబ్రవరి తర్వాత అణుకేంద్రాల్లో ఐఏఈఏ అమర్చిన కెమెరాలకు సంబంధించిన ఫొటోలు ఇవ్వమని ఇరాన్​ పేర్కొంది. తర్వాత దీన్ని మరో మూడు నెలలు పొడిగించింది. 2015లో ఇరాన్​తో అమెరికా, ఇతర దేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి 2019లో డొనాల్డ్​ ట్రంప్​ వైదొలిగారు. ఇరాన్​పై కఠిన ఆంక్షలు వింధించారు. ఇప్పుడు.. బైడెన్​ ప్రభుత్వం మళ్లీ ఒప్పందంలో చేరేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో 2015 ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఇరాన్​ వేగవంతం చేసింది.

ఇదీ చదవండి:'చైనా మారథాన్'​లో విషాదం- 21 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details